31 New Cases In Telangana in ONe Day

తెలంగాణలో శనివారం ఒక్కరోజే 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా కేసులు నమోదవడం తొలిసారి. వీటితో కలిపి మొత్తం కేసులు 1163కి చేరిందని తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.ఈ కేసుల్లో 30 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా ఓ వలస కూలీకి కరోనా పాజిటివ్ వచ్చిందని 24 మంది హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారని ప్రకటించింది.. వీరితో కలిపి డిశ్చార్జైన వారి సంఖ్య మొత్తం 751కి చేరింది. ప్రస్తుతం 382 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 30 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేసులు పెరగడంతో హైదరాబాద్ లో ఇచ్చిన సడలింపులు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం మొదటిసారి. ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడంతో కలవరం మొదలైంది. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేస్తే మరికొన్ని కేసులు వెలుగులోకి వస్తాయని పలువురు చెబుతున్నారు. రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్న కేసీఆర్ మరి తాజాగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
Comments
Post Your Comment
Public Comments: