Coronavirus Shocking News We Live With Coronavirus In India

Health

views 21

May 9th,2020

ఏపీ సీఎం జగన్ ఇది వరకు కరోనాతో కలిసి బతకాల్సిందేనని  ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని అని లాక్ డౌన్ సడలించాలని సూచించారు. అప్పుడు ఆ మాటలే నిజమై జగన్ ను విమర్శించిన వాళ్లకు ఇప్పుడు కేంద్రం ప్రకటన చెంపపెట్టులా మారింది.

కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో  కరోనా కేసుల సంఖ్య 59662కి చేరిందని.. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 1985మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడం తో కేంద్ర ప్రభుత్వంలో నిరాశ నిసృహ వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని, కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని  సంచలన వ్యాఖ్యలు చేశారు.

వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో కరోనా విజృంభించే అవకాశాలున్నాయని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కూలీల కోసం 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. 2.5 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లారని లవ్ అగర్వాల్ తెలిపారు.దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయటపడలేదని లవ్ అగర్వాల్ తెలిపారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...