Army engineers toil 72 hours to finish Galwan bridge

National

views 197

Jun 21st,2020

LAC వెంబడి చైనా దుర్బుద్ధి బయటపడుతూనే ఉంది.లద్దాఖ్‌ ప్రాంతంలో గల్వాన్‌ నదిని కప్పేయడానికి లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి చైనా పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 5 కి.మీ.లకు పైగా చైనా ట్రక్కులు, సైనిక వాహనాలు, బుల్డోజర్లు ఉన్నట్లు తెలుస్తోంది.భారత్‌ వైపు ఎల్‌ఏసీ ప్రాంతానికి వచ్చేసరికి నీటి ప్రవాహం కుంచించుకుపోవడమే కాకుండా బురదగా కనిపిస్తోంది.గల్వాన్‌ ఘటనతో ఏమాత్రం తగ్గకుండా భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం ఆర్మీ కంబాట్‌ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గల్వాన్‌ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి' అనేది ముఖ్యమైన విషయం. వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది 72 గంటల పాటు పనులు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేసీ రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. ఈ వంతెనతో దర్బాక్‌ నుంచి దౌలత్‌ బేగ్‌ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్‌ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...