Hetero to launch Covid drug Remdesivir under brand name Covifor

భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును కనుగొన్నట్లు ప్రకటించింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై గ్లెన్ మార్క్ అధ్యయనం చేసి, 'ఫాబిప్లూ' బ్రాండ్ పేరిట ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు వెల్లడించింది.భారత ఔషధ నియంత్రణ సంస్థ ICMR నుంచి అనుమతులు లభించాయని శుభవార్త చెప్పింది.తాజాగా మరో సంస్థ కూడా కరోనాకి మందు కనిపెట్టామని ప్రముఖ జెనిరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో ప్రకటించింది.కోవిఫర్' పేరిట మెడిసిన్ సిద్ధమైందని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి తెలిపారు.కోవిఫర్' అనే పేరుతో మార్కెట్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 100 మిల్లీగ్రాముల వయల్ (ఇంజెక్షన్) రూపంలో అందుబాటులో ఉంటుందని అన్నారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం అనుమతి కూడా పొందినట్లు వివరించింది. గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీతో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన స్పష్టంచేశారు.
Comments
Post Your Comment
Public Comments: