బంపర్‌ ఆఫర్‌ : రూ. 200 లేకే శ్రియతో

Movie

views 285

May 6th,2020

కరోనా సంక్షోభంలో నిరుపేదలకి అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు కొందరు విరాళాలు అందిస్తుండగా, మరి కొందరు నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చేందుకు శ్రియ తన వంతు సాయమందించడానికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. @thekindnessproject.in లో కేవలం రూ. 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ను మెయిల్ చేస్తే మే 9 శనివారం సాయంత్రం 8 గంటలవరకు మీకు ఈ అవకాశం ఉంది. ఆదివారం విజేతలను ప్రకటిస్తామని లక్కీడ్రాలో  గెలిచినవారితో వీడియో కాల్లో తనతో కలిసి డ్యాన్స్, యోగా చేసే అవకాశం పొందవచ్చని మీరిచ్చే విరాళాలన్నీ నిరుపేదలకు చేరుతాయని ఈ మంచి పనిలో అందరం భాగస్వాములం అవుదాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చింది శ్రియ.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...