Home Minister Amit Shah dismisses rumours surrounding his health

తన వస్తోన్న వదంతుల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆరోగ్యంగానే ఉన్నానని, పూర్తి అంకితభావంతో తన విధులను నిర్వర్తిస్తున్నానని అమిత్ షా తెలిపారు. ‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, ఏ జబ్బుతోనూ బాధపడటం లేదు’ అని ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నా ఆరోగ్యం బాగోలేదని వదంతులు నా దృష్టికి వచ్చినప్పుడు.. అలాంటి రూమర్లను వ్యాపింపజేసే వాళ్లు ఎంజాయ్ చేయాలని భావించాను. అందుకే ఇంతకు ముందు ఈ విషయమై వివరణ ఇవ్వలేదు’ అని షా తెలిపారు. కానీ లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందే ప్రమాదం ఉండటంతో రూమర్ల గురించి స్పందించాల్సి వచ్చిందన్నారు. హిందువుల నమ్మకం ప్రకారం ఆరోగ్యం బాగోలేదనే వదంతుల మరింత ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయని అమిత్ షా తెలిపారు. తన ఆరోగ్యం గురించి రూమర్లు ప్రచారం చేయకుండా.. నా పని నన్ను చేసుకొనిస్తారని భావిస్తున్నా అని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Post Your Comment
Public Comments: