ఇద్దరు రోహింగ్యాలకు కరోనా.. తెలంగాణలో మర్కజ్ లింక్...

మర్కజ్-కరోనా లింక్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌కు రాష్ట్రంలో నివసిస్తున్న ఏడుగురు రోహింగ్యా శరణార్థులు హాజరయ్యారని వారిలో ఇద్దరు కరోనా బారినపడ్డారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.వారి కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్ సెంటర్‌కు తరలించి పరీక్షలు చేస్తు మర్కజ్‌కు వెళ్లొచ్చిన తర్వాత వారు ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. తబ్లీఘీ జమాత్‌కు పెద్ద సంఖ్యలో రోహింగ్యా శరణార్థులు హాజరయ్యారని కేంద్రం దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రోహింగ్యాలపై దృష్టిపెట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించి వారందరికీ వెంటనే కరోనా పరీక్షలు చేయించాలని ఆదేశాలు జారీచేసింది. పెద్ద మొత్తంలో రోహింగ్యాలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో మర్కజ్‌తో లింక్ ఉన్నవే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న రోహింగ్యాలకు పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరిని కరోనా వైరస్ సోకినట్లు రిపోర్టుల్లో బయటపడింది.
Comments
Post Your Comment
Public Comments: