కేంద్రం పన్నుల్లో తెలుగు రాష్ట్రాల వాటా విడుదల..

ఏప్రిల్ నెలకు సంబంధించి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను సోమవారం విడుదల చేసింది.ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలను అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది.15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధుల కేటాయింపు జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ కి రూ.1892.64కోట్లు , తెలంగాణ కి రూ.రూ.982 కోట్లు విడుదల చేసింది.అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.8255కోట్లు, బీహార్‌కు రూ.4631కోట్లు,మధ్యప్రదేశ్‌కు రూ.3630కోట్లు,పశ్చిమ బెంగాల్‌కు రూ.3461కోట్లు విడుదల చేసింది. అత్యల్పంగా గోవాకు రూ.155కోట్లు విడుదల చేసింది.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలైన తర్వాత ఆదాయ మార్గాలన్నీ దాదాపు మూసుకుపోవడంతో రాష్ట్రాలపై ఆర్థికపరమైన ఒత్తిడి తీవ్రమై ఖజానాలు ఖాళీ అయిన పరిస్థితి నెలకొన్నది .ఇలాంటి పరిస్థితులలో కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రాలకు కొంత రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల వాటాను 42శాతం నుంచి 41శాతానికి తగ్గించారు. రాష్ట్రాలకు 41 శాతం నిధుల పంపిణీ ప్రకారం తెలంగాణకు 16,726.58 కోట్లు , ఏపీకి రూ.32,27.68 కోట్లు కేంద్ర పన్నులు, సుంకాల రూపంలో రావాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడడం, వాటి భద్రతాపరమైన మరియు ఇతరత్రా అవసరాలకోసం కేంద్రమే నిధులు ఇవ్వాల్సి రావడంతో ఈ ఒకశాతాన్ని తగ్గించినట్టు కేంద్రం గతంలో వెల్లడించింది.కానీ కరోనా సంక్షోభంతో నేపధ్యంలో ఈసారి నిధులు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
అన్నీ రాష్ట్రాల కేంద్రం నిధుల వివరాలకోసం ఈ క్రింది లింల్ మీద క్లిక్ చేయండి.
► https://twitter.com/FinMinIndia/status/1252215778272665600
Comments
Post Your Comment
Public Comments: