భారత్‌లో సగం జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్... కంట్రోల్ అవుతున్న కరోనా...

విదేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా నియంత్రణ చాలా బాగా జరుగుతోంది.ఇండియాలో కరోనా వైరస్ క్రమంగా కంట్రోల్ అవుతోంది.అందుకు కేంద్రం చెప్పిన లెక్కలే నిదర్శనం. గోవా, మణిపూర్ రాష్ట్రాలే ఇందుకు నిదర్శనం. నిజానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఆ కేసులు నమోదవుతున్నది కొన్ని చోట్ల మాత్రమే. ఏప్రిల్ 4 నుంచి గోవాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో... దేశంలోని కరోనా నుంచి బయటపడిన రాష్ట్రంగా గోవా గుర్తింపు తెచ్చుకుంది.గోవాకి విదేశీయులు ఎక్కువగా వస్తుంటారు. అందువల్ల అక్కడ ఎక్కువ కేసులు ఉండే అవకాశాలున్నాయి. కానీ ప్రభుత్వ కఠిన చర్యల వల్ల ఏడు కేసులే నమోదయ్యాయి.దేశంలోని 736 జిల్లాల్లో ఏప్రిల్ 19 నాటికి 325 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ కూడా కరోనా లేని రాష్ట్రంగా మారిపోయింది. సిక్కింలో ఇంతవరకూ ఒక్క కరోనా కేసు కూడా కాలేదు. పక్కనే చైనా, నేపాల్, భూటాన్ దేశాలున్నా ఆ రాష్ట్రం జనవరి 29 నుంచే అన్ని జాగ్రత్తలూ తీసేసుకుంది. 6 లక్షల మందిని స్క్రీనింగ్ చేసింది. కరోనాతో ఉక్కిరిబిక్కిరైన కేరళ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో ముంబై, తెలంగాణలో హైదరాబాద్, మధ్యప్రదేశ్‌లో ఇండోర్ లాంటి నగరాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల ఎక్కడ ఎక్కువ కేసులొస్తున్నాయో అక్కడ ఎక్కువ కంట్రోల్ చేస్తే కచ్చితంగా కరోనాకి చెక్ పెట్టవచ్చని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Post Your Comment
Public Comments: