Rafale jets to come to India In July

National

views 69

May 15th,2020

జూలై చివరిలోగా నాలుగు రఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు రానున్నట్లు తెలుస్తున్నది. రఫేల్ యుద్ధ విమానాల తో భారత వైమానిక సామర్థ్యం పెరగనున్నది. మే చివరిలోగా యుద్ధవిమానాలు డెలివరీ కావాల్సి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆ యుద్ధ విమానాల డెలివరీ వాయిదా పడింది. వీటిలో ఒకటి సింగిల్ సీటర్ ఉన్నట్లు మూడు రెండు సీట్ల విమానాలు  అధికారులు తెలిపారు. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో 60 వేల కోట్ల డీల్‌ను భారత్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.రఫేల్ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ ఆర్‌కే బదౌరియాకు సముచిత గౌరవం ఇవ్వనున్నారు. విమానాల టెయిల్ నెంబర్లకు ఆర్‌కే సిరీస్ ఇవ్వనున్నారు. అంబాలా ఎయిర్‌బేస్‌కు విమానాలు రానున్నాయి. 17 గోల్డెన్ ఆర్సో స్క్వాడ్రన్ పైలట్ తొలి విమానాన్ని భారత్‌కు తీసుకురానున్నారు. మార్గమధ్యంలో మిడిల్ఈస్ట్‌లో ఉన్న ఫ్రెంచ్ ట్యాంకర్‌లో ఇంధన నింపనున్నారు ఐతే సింగిల్ జర్నీలో ఇండియాకు రావొచ్చు, కానీ చిన్న కాక్‌పిట్‌లో సుమారు 10 గంటల పాటు కూర్చోవడం సరికాదు అని అధికారులు చెప్తున్నారు. రఫేల్ విమానాలను నడిపే భారతీయ పైలట్లు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...