World Bank Approves USD 1 Billion Social Protection Package for India

సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నసంగతి తెలిసిందే. కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి ప్రపంచ బ్యాంకు భారీ ఊరట నిచ్చింది.కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్‌కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరో బిలియన్ డాలర్లు అందివ్వ నుంది. అలాగే ఎంఎస్‌ఎంఈ ల కోసం మూడవ ప్యాకేజీ కూడా రానుదని భావిస్తున్నారు. దేశంలోని పట్టణ పేదలు , వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా 1 బిలియన్ డాలర్లు సహాయాన్ని అందించనుంది.కోవిడ్-19 , లాక్‌డౌన్ వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదల పట్ల సామాజిక భద్రతను తిరిగి సమతుల్యం చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు.సోషల్ సెక్యూరిటీ టెక్నాలజీ ప్యాకేజీ కింద భారత్‌లోని 400కు పైగా సామాజిక భద్రతాపథకాల అమలుకు ఈ వంద కోట్ల డాలర్లు ఉపయోగపడనున్నాయని బ్యాంకు పేర్కొంది.నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ చాలా ముఖ్యమైనదని ప్రశంసించారు. కోవిడ్ -19 తరువాత దేశంలో జీవితం, జీవనోపాధి పరిస్థితుల్లో పెద్ద తేడా ఉండబోదని భావిస్తున్నాన్నారు. నగదు బదిలీ విధానం చాలా కీలకమైందని, దాని వల్ల జీవణ ప్రమాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: