స్పెయిన్ లో కరోనా ఎఫెక్ట్ .. 24 గంటల్లో 2000 కొత్త కేసులు

యూరప్ దేశాల్లో కరోనా వైరస్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, స్పెయిన్ లో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నది. గత 24 గంటల్లో స్పెయిన్ లో 2000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశం మొత్తం అలర్ట్ అయ్యింది.
స్పెయిన్ లో వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసికట్టుగా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు దాదాపుగా 6వేలమంది వరకు మరణించడగా, రెండులక్షల మంది వరకు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
Comments
Post Your Comment
Public Comments: