Ivanka Trump's personal assistant tests positive for coronavirus

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్సనల్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే వైట్ హౌస్ సిబ్బంది ఇద్దరు కరోనా బారిన పడగా ఆ జాబితాలో ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలు చేరారు. దాదాపు రెండు నెలలుగా ఇవాంకా పర్సనల్ అసిస్టెంట్ టెలీవర్కింగ్ చేస్తున్నారు. ఆమెకు కరోనా లక్షణాలేవీ కనిపించలేదని సమాచారం. ఇవాంకాతోపాటు, ఆమె భర్త జరేద్ కుష్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సె మీడియా కార్యదర్శి కాటీ మిల్లెర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి గురువారం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఇక నుంచి తాను ప్రతి రోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటానని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో వైట్ హౌస్ లో పని చేస్తున్నవారు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. కరోనా టెస్టులు చేయడంతోపాటు టెంపరేచర్ చెక్ చేస్తు సిబ్బంది ఉండే వెస్ట్ వింగ్‌ను తరచుగా శానిటైజ్ చేస్తన్నారు.
Comments
Post Your Comment
Public Comments: