coronavirus cases in maharashtra crosses 20000 mark

దేశంలోని కరోనా కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే 45 శాతానికిపైగా కేసులు, 50 శాతానికిపైగా కరోనా మరణాలు నమోదు కావడం గమనార్హం.మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడి మొత్తం 779 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. శనివారం 1165 కొత్త కేసులు నమోదు కాగా 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 20,228కి చేరింది. దేశంలో 60 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలో మూడొంతుల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ 12864 కరోనా కేసులు నమోదు కాగా.. 489 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 3800 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
నాసిక్ డివిజన్‌లో 857 కేసులు, పుణే డివిజన్‌లో 2513 కేసులు, కొల్హాపూర్ డివిజన్‌లో 77, ఔరంగాబాద్ డివిజన్‌లో 514, లాథూర్ డివిజన్లో 62, అకోలా డివిజన్‌లో 345, నాగపూర్ డివిజన్లో 230 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. థానే డివిజన్ పరిధిలో 15,595 కేసులు నమోదు అవ్వగా 524 మంది చనిపోయారు. గుజరాత్‌లో 7797 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 472 మంది చనిపోయారు. అహ్మదాబాద్ నగరంలోనే 5540 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Post Your Comment
Public Comments: