sbi home loan emis to fall as bank cuts mclr

ఎస్‍బీఐ తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించిది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్లు కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా సవరింపుతో వార్షిక ఎంసీఎల్‍ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి తగ్గింది. ఈ రేట్లు మే 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎంసీఎల్‍ఆర్‍లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది.
Comments
Post Your Comment
Public Comments: