అక్షయ్ కుమార్‌కి కరోనా ఎఫెక్ట్.....

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా సూర్యవంశీ కి కరోనా ఎఫెక్ట్ తగిలింది. దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి వాయిదా వేశారు. పరిస్థితి చక్కబడిన తరవాత సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కావాల్సిఉంది. కానీ, కరోనా ఎఫెక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర విడుదలను వాయిదా వేశారు.ఏడాదికి పైగా నిబద్ధతతో ఎంతో కష్టపడి అద్భుతమైన అనుభూతిని మీకు అందించేందుకు ‘సూర్యవంశీ’ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ట్రైలర్‌కు వచ్చిన స్పందన అద్భుతం. ఈ స్పందనతో ఇది ప్రేక్షకుల సినిమా అని స్పష్టమైంది. ఈ సినిమాను మీకు, మీ కుటుంబానికి అందిద్దామని మేం కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యాం. కానీ, కోవిడ్ - 19(కరోనా వైరస్) విజృంభిస్తున్న నేపథ్యంలో మా ప్రియమైన ప్రేక్షకుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని సూర్యవంశీ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం. సరైన సమయంలో ‘సూర్యవంశీ’ మీ ముందుకు వస్తుంది. భద్రత చాలా ముఖ్యం.. దాని తరవాతే ఏదైనా. సినిమా వచ్చేంత వరకు మీ ఉత్సుకతను అలాగే కొనసాగిస్తూ, మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ దృఢంగా ఉండండి’’ అని టీమ్ ‘సూర్యవంశీ’ తరఫున చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటనలో పేర్కొంది.
Comments
Post Your Comment
Public Comments: