ఎయిర్‌పోర్టులో..పూజా హెగ్డేకు కరోనా కష్టాలు..

రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తోన్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా షూటింగ్‌ను పూజా హెగ్డే ఎప్పుడో పూర్తి చేసేశారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. అక్కడ కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. ప్రభాస్ కూడా ఇప్పటికే అక్కడికి వెళ్లిపోయారు. అయితే, అక్కడే ప్రభాస్ - పూజా హెగ్డే కాంబినేషన్ సీన్స్ చేయాల్సి ఉంది. దీని కోసం ఇండియా నుంచి పూజా హెగ్డే బయలుదేరి వెళ్లారు. అయితే, ఆమె టర్కీలోని ఇస్తాంబుల్ మీదుగా జార్జియా వెళ్లారు.ఇస్తాంబుల్ న్యూ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పూజా.. ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని ఉన్నారు. దీనికి కారణం కరోనా వైరస్ భయం. ప్రస్తుతం యూరప్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అందుకే, రక్షణ చర్యల్లో భాగంగా పూజా హెగ్డే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
Comments
Post Your Comment
Public Comments: