విశాఖ ఎల్జి పాలిమర్స్ లో గ్యాస్ లీక్... స్పృహ తప్పిపోయిన జనం...?

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి వెలువడిన విషవాయువు కారణంగా ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ మొత్తంలో లీకైన ఈ గ్యాస్ దాదాపు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు.ఈ విష వాయువు కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.రోడ్డుపై వెళ్తున్న ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నారు. అధికారుల సమాచారం అందుకొని హుటాహుటిన అక్కడకు చేరుకొని స్పృహ కోల్పోయిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ జనాలను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ సైతం స్పృహ కోల్పోయిన పరిస్థితి వచ్చింది.ఎంతో ఘాఢతతో కూడుకున్న ఈ ఈ విష వాయువుని పీల్చడం వల్ల ఎక్కడికక్కడ స్పృహ కోల్పోతు, తీవ్రమైన కళ్ల మంటలు, కడుపులో వికారం శ్వాస తీసుకోవడంలో లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.విష వాయువు లీకేజీ ఆపటం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని అందుకే వెంటనే ప్రజలు తమ తమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Post Your Comment
Public Comments: