తలుపులు తెరుచుకున్న కేథార్‍నాథ్ ఆలయం

వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేథార్‍నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ రోజు ఉదయం సరిగ్గా 6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు తెరిచారు చేశారు. ఉత్తరాఖండ్ లోని గడ్డస్థల్ వద్ద ప్రారంభైన గౌరీకుండ్ వరకు వాహనంలో సాగింది. అక్కడి నుంచి కాలినడకన కేదారనాథున్ని పవిత్ర పంచముఖి డోలి యాత్ర ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు. కుమావో బెటాలియన్ ఆర్మీ నేతృత్వంలో ప్రతీ సంవత్సరం ఈ యాత్ర జరుగుతుంది. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి పలుగొని శివనామస్మరణతో మారుమోగిస్తారు. లాక్‍డౌన్ కారణంగా ఈ ఏడాది కేవలం ఐదుగురు పూజారులు మాత్రమే డోలీ యాత్రలో పాల్గొన్నారు.లాక్‍డౌన్ పూర్తయిన తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఆలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ ఆలయాన్ని నవంబర్‍లో మూసివేస్తారు.
Comments
Post Your Comment
Public Comments: