అమెరికా నష్ట పరిహారం డిమాండ్.. షాక్ లో చైనా

చైనా మీద ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. చైనా కరోనా వైరస్ గురించిన ఎలాంటి విషయాలను సకాలంలో అందరికి తెలియపరచాక పోవటం వల్ల 184 లకి పైగా దేశాలు ఈరోజు నరకం అనుభవిస్తున్నాయని మీడియా సమావేశంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఇప్పటికే జర్మనీ కరోనా కల్లోలానికి పరిహారంగా 140 బిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తున్నదని అమెరికా అంతకంటే ఎక్కువ పరిహారం డిమాండ్ చేస్తుందని సూచించారు. తొలిదశలోనే ప్రపంచ దేశాలతో కరోనా వైరస్ గురించిన సమచారాన్ని పంచుకుంటే ముప్పు తగ్గేదని అమెరికా, బ్రిటన్, జర్మనీ నేతలు భావిస్తున్నారు. కరోనా వైరస్ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని, పరిహారం డిమాండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‍పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు.
Comments
Post Your Comment
Public Comments: