ఇళ్ళకు తాళాలు .. గద్వాలలో చైనా రూల్స్

తెలంగాణా లో కరోనా కట్టడి కోసం జిల్లాల వారీగా అధికార యంత్రాంగం ఎవరికి తోచిన విధానంలో నియంత్రణా చర్యలను అనుసరిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార యంత్రాంగంకరోనా కట్టడికి వినూత్నంగా చైనా లో అవలంభించిన విధానం అమలు చేస్తుంది .చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టటం కోసం ప్రజలెవరూ బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అదేవిధంగా గద్వాల జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఇక అక్కడ ప్రజలకు నిత్యావసరాలు , కూరగాయలు అక్కడి ప్రజలు కాల్ చేసి చెప్తే ఇంటికే తీసుకెళ్ళి ఇస్తు వారిని బయటకు రాకుండా ఇంటికి తాళాలు వేస్తున్నారు .కరోనా వైరస్ ప్రభావం ఉన్న రెడ్ జోన్ ల పరిధిలో కూడా ప్రజలను కట్టడి చెయ్యటం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇదే విధానం అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పటం లేదని అంటున్నారు అధికారులు . ఏది ఏమైనా ప్రజలు కరోనా పై పోరాటానికి అధికారులకి అండగా ఉండాలని కోరుకుందాం.
Comments
Post Your Comment
Public Comments: