పెన్షన్‌లపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోఘ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని పెన్షనర్లకు పూర్తి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు 50 శాతం మాత్రమే పెన్షన్ చెల్లించింది. ముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పెన్షన్ తగ్గింపుపై హైకోర్టుకు లేఖ రాయాగా దానిని న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించి సోమవారం తుది విచారణ ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ పూర్తి పెన్షన్ చెల్లించాలంటూ జీవో జారీ చేసింది. పెన్షనర్లకు పూర్తి పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఏపీలోని వైద్యులు, పోలీసులు, సచివాలయ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Post Your Comment
Public Comments: