కిమ్ మరణించాడట.. అసలు నిజమెంత...

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందనే విషయం చక్కర్లు కొడుతుంది.సోషల్ మీడియాలో కిమ్ చనిపోయాడంటూ పుకార్లు పెద్ద ఎత్తున #KIMJONGUNDEAD అనే హ్యాష్ ట్యాగ్ నిన్నటి నుంచి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. హాంకాంగ్ శాటిలైట్ టెలివిజన్ వైస్ డైరెక్టర్ షిజియాన్ జింగ్‌జౌ తనకు ఉత్తర కొరియా నిరంకుశుడు కిమ్ జోంగ్ చనిపోయినట్లు తన వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందంటున్నారు. ఒక జపనీస్ పత్రిక మాత్రం కిమ్ జోంగ్ ఉన్ ఈ నెల ప్రారంభంలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని,ఆయన ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని పేర్కొంది.ఉత్తర కొరియాకు చెందిన కహీవా అనే రిపోర్టర్ మాత్రం కిమ్ చనిపోయారని, ఈ విషయాన్ని అక్కడి అధికారులు బయటికి రానివ్వడం లేదని ,అంతేకాకుండా కిమ్ స్థానంలో తన సోదరి కిమ్ యో జోంగ్ కూడా బాధ్యతలు చేపట్టారని తెలిపింది. అటు నియంతకు చెందిన 250 మీటర్ల పొడవైన రైలును వోన్సాన్ హాలిడే కాంపౌండ్ సమీపంలో ఉపగ్రహ ఫోటోలలో గుర్తించినట్లు న్యూస్ వెబ్‌సైట్ 38 నార్త్ తెలిపింది. కిమ్ ఆచూకీ తెలియకపోయినా, తూర్పు తీరంలోని ‘ఎలైట్’ ప్రాంతంలో కిమ్ కుటుంబానికి రిజర్వు చేయబడిన సమీప రైల్వే స్టేషన్ వద్ద రైలు ఉండటం.. ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళినట్లు సూచిస్తోంది. కిమ్ గురించి అనేక రకాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నార్త్ కొరియా ఇంతవరకు ఏవిధమైన అధికారిక ప్రకటన చేయకపోవటం గమనార్హం.
Comments
Post Your Comment
Public Comments: