ఏప్రిల్ 30 నుండి భారత్ లో తగ్గనున్నకరోనా....

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. మిగతా దేశాలతో పోల్చి చూసినా కరోనా వ్యాప్తి కరోనా వల్ల మరణాల రేటు చాలా తక్కువగానే ఉందని కేంద్రం అధికారంగా ప్రకటిస్తుంది.మే 3 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి గురించి కేంద్రం ఒక అంచనాకు వచ్చిందని ఆ మేరకు దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేసేలా చర్యలు తీసుకోనుంది. అయితే ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే .. మే 3 తర్వాత మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రకటన కూడా చేయవచ్చు.అయితే కరోనా ప్రభావంతో భారత్ భయాందోళ నలకు గురి కానవసరం లేదని చెబుతున్నాయని ఏప్రిల్ 29 వరకూ కేసుల సంఖ్య చాలా పెరిగినా ఆ తర్వాత కరోనా కేసులు కచ్చితంగా తగ్గుముఖం పడతాయని వారు చెబుతున్నారు. ఏప్రిల్ 29 దేశంలో కరోనా కేసులకు పీక్ స్టేజి అని ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అని మే రెండో వారానికి కొత్త కరోనా కేసులు ఉండవని వారు వెల్లడించారు.
Comments
Post Your Comment
Public Comments: