లాక్‌డౌన్ పై యోగి కీలక ఆదేశాలు...

కరోనా వైరస్ నియంత్రించేందుకు యోగి అదిత్యనాథ్ కీలక ఆదేశాలను జారీ చేశారు.కరోనా వైరస్ నేపథ్యంలో పలు రాష్ట్రలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి అదిత్యనాథ్ మాత్రం జూన్ 30వ తేదీ వరకు జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలను జారీ చేశారు. రాజకీయ ర్యాలీలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుందని ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ సిఎం ఆదేశించారని జూన్ 30 వరకు ప్రజలు గుమికూడకుండా కఠిన చర్యలను తీసుకోవాలని కరోనాను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: