పాకిస్తాన్ లో రంజాన్.... ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

కరోనా మహమ్మారి కబళించి వేస్తోందని సభ్యదేశాలు లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం నిబంధనలన్ని తుంగలోతొక్కి రంజాన్ పర్వదినం పట్ల పాకిస్థాన్ పౌరులందనికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.రంజాన్ పర్వదిన సందర్బంగా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలకు శరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
"ఇస్లామాబాద్‌లో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాక్ అద్యక్షులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇదే అంశాన్న పాక్ రేడియో దృవీకరించినట్టు తెలుస్తోంది".
ప్రార్ధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని ,ప్రార్థనల సందర్బంగా మసీదుల్లో కార్పెట్ వేయకూడదని, అంతేకాకుండా మసీదుకు వచ్చేవారు ఫేస్ మాస్క్ ధరించి, ప్రార్ధన చేసే ముందు 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లలు, ఫ్లూ, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారితో పాటు 50 సంవత్సరాలు పైబడిన వారికి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని ఆల్వి తెలిపారు.కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గణనీయంగా పెరిగినా ఆంక్షలు తొలగిస్తున్న పాక్ ప్రధాని ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో సుమారు 9వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో 176 మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో గత నెలలోనే అక్కడి స్థానిక ప్రభుత్వాలు మసీదులలో సామూహిక ప్రార్థనలు, ఇతర మత సమావేశాలను నిరవధికంగా నిషేధించాయి. కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సభ్య దేశాలను డబ్ల్యూ హోచ్ ఓ పదే పదే హెచ్చరిస్తోంది. దాదాపు 120దేశాలు లాక్ పాటిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించి సామూహిక ప్రార్థనలకు అనుమతించడం పట్ల పాక్ ప్రజలు హర్షం చేస్తున్నప్పటికి, ఇరుగు పొరుగు దేశాల్లో మాత్రం ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా అంతర్జాతీయ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయాలిన ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Comments
Post Your Comment
Public Comments: