మీడియాతో కేటీఆర్ .... కరోనా కేసుల 70శాతం మర్కజ్‌కు లింక్...

సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందన్నారు. జిల్లాలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందన్నారు. ఇకపై మరో కొత్త కేసు నమోదు కావొద్దన్నారు. తబ్లిగీ జమాత్ లేకపోతే జిల్లాలో ఆ ఒక్క కేసు కూడా ఉండేది తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70శాతం మర్కజ్‌కు లింక్ ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ నుంచి ఢిల్లీలో తబ్లిగీ జమాతే సంస్థ నిర్వహించిన సమావేశానికి 1200 మంది వెళ్లొచ్చారని చెప్పారు. రాబోయే రెండు వారాలు కీలకమని చెప్పిన కేటీఆర్ త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందామని కేటీఆర్ అన్నారు. ప్రజలు స్వీయనియంత్రణలో ఉండాని పల్లెల్లో యువత సామాజిక దూరం పాటిస్తున్నారని, పట్టణాల్లో మాత్రం పాటించడం లేదని స్పష్టం చేశారు. అధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని, లేకపోతే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Post Your Comment
Public Comments: