ఏపీలో కరోనా ..ఒక్కరోజే ఐదుగురు మృతి.....మొత్తం 525 కరోనా కేసులు...

ఈ రోజుఏపీలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురం జిల్లాలో ఒక కొత్త కేసు నమోదైంది. కొత్తగా నమోదైన 23 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 525కి పెరిగింది. వారిలో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది చనిపోయారు. ప్రస్తుతం 491 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం 2(మొత్తం కేసులు : 21), కర్నూలు 2 (మొత్తం కేసులు : 110) , నెల్లూరు 2 (మొత్తం కేసులు : 58) చొప్పున చనిపోయారు. ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు కరోనా పాజిటివ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14కు పెరిగింది.
మొత్తం కేసుల సంఖ్య .....
1. అనంతపురం - 21
2. చిత్తూరు - 23
3. తూర్పు గోదావరి - 17
4.పచ్చిమ గోదావరి - 31
5. గుంటూరు - 122
6.కడప - 36
7.కృష్ణా - 45
8.కర్నూల్ - 110
9.నెల్లూరు - 58
10.ప్రకాశం - 42
11.శ్రీకాకుళం - 0
12.విశాకపట్నం - 20
13.విజయనగరం - 0
Comments
Post Your Comment
Public Comments: