సీఎం కేసీఆర్ కీలక ప్రకటన....ఏప్రిల్ 30 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు...

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నామని కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయించామని తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టుప్రజల క్షేమం కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని చెప్పారని పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 30 తరువాత దశలవారీగా లాక్ డౌన్‌ను ఎత్తేస్తామని తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. ఒకటి నుంచి 9వ తరగతి పరీక్షలు రాష్ట్రంలో జరగలేదనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉందన్న విద్యార్థులందరినీ ఎగువ తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ వెల్లడించారు. రైతాంగానికి ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందిస్తామని ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.లాక్ డౌన్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఒకరిద్దరు ముఖ్యమంత్రులు కోరారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 503 నమోదు కాగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, 96 మంది కోలుకున్నారని ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 393 మంది ఉన్నారని 1654 మంది క్వారంటైన్‌లో సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 243 చోట్ల కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఉన్నాయని... జీహెచ్ఎంసీ పరిధిలో 123, జీహెచ్ఎంసీయేతర ప్రాంతాల్లో ప్రాంతాల్లో 120 ఉన్నాయని కేసీఆర్ అన్నారు
Comments
Post Your Comment
Public Comments: