కరోనా గురించి మరో భయంకరమైన వాస్తవం.....

ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్ గురించిన మరో భయంకర విషయాన్ని గుర్తించారు. కరోనా వైరస్ టెస్టు నెగటివ్ వచ్చినా కూడా మనిషి శరీరంలో ఏదో ఒక భాగంలో కరోనా వైరస్ ఉంటుందని పాజిటివ్ వచ్చిన వారి మలం ఇంకా కళ్లలో కరోనా వైరస్ ను గుర్తించామని కోవిడ్ టెస్టు నెగటివ్ వచ్చిన వారికి నెల రోజుల తర్వాత మలం ఇంకా కళ్లెను పరీక్షించిన శాస్త్రవేత్తలకు షాకింగ్ విషయాలు తెలిశాయట. రిపోర్ట్ లో నెగటివ్ వచ్చినంత మాత్రాన పూర్తిగా కరోనా వైరస్ నుండి బయట పడ్డట్లుగా కాదని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం భయంను కలిగిస్తోంది. మున్ముందు ఈ కరోనా వైరస్ గురించి మరెన్ని భయంకర విషయాలను తెలుసుకోవాల్సి వస్తుందో అంటూ భయాందోళన వ్యక్తం అవుతోంది.
Comments
Post Your Comment
Public Comments: