నిర్భయ దోషులు జైలులో ఎంత సంపాదించారో తెలుసా ........?

నిర్భయ కేసు లో దాదాపు ఏడేళ్ల తర్వాత నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో శుక్రవారం ఉదయం 05:30 గంటలకు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను ఉరితీశారు. తరువాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు. వీరిని ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే ముందు నలుగురు దోషులు కంటతడి పెట్టినట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ నలుగురు కూడా శిక్ష అనుభవిస్తున్న కాలంలో జైళ్లో పనిచేసి మొత్తం రూ.1,37,000 సంపాదించారు. వాటిలో అక్షయ్ రూ. 69 వేలు సంపాదించగా, పవన్ రూ. 29 వేలు, వినయ్ రూ. 39 వేలు సంపాదించారు
Comments
Post Your Comment
Public Comments: