Trump Says Hydroxychloroquine Is The Best Medicine

Health

views 15

Jun 16th,2020

గత మార్చిలో సీరియస్‌ కేసులకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎమర్జెన్సీ డ్రగ్‌గా వాడటానికి FDA అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్-19 సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లో యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ) వాడవచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని సోమవారం అమెరికా ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) వెనక్కి తీసుకుంది. ఈ మందు వల్ల ఉపయోగం లేదని, హైడ్రోక్సీక్లోరోక్విన్ యాంటీ వైరల్‌ కణాలను ఉత్పత్తి చేస్తుందనడం వాస్తవంకాదని, ఇటీవల జరిగిన క్లినికల్ ట్రయల్స్‌ లో ఈ విషయం తేలిందని ఎఫ్‌డిఎ తెలిపింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కోవిడ్‌ -19 చికిత్సలో వాడవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బీష్మించారు. ఎఫ్‌డీఏ నిర్ణయంపై స్పందిస్తూ...హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రభావం గురించి తాను కొన్ని గొప్ప నివేదికలు విన్నానని,తాను గతంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తీసుకున్నానని, దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవని,తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని,కానీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం డ్రోక్సీక్లోరోక్విన్ అత్యవసర వినియోగ అధికారాన్ని ఎందుకు రద్దు చేసిందో అర్థం కాలేదని ట్రంప్ అన్నారు.ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ...FDA బయటపెట్టిన 'నివేదిక గురించి నాకు తెలియదు. కానీ ఫ్రాన్స్, స్పెయిన్ మరియు ఇతర ప్రదేశాల నుండి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ గురుంచి మంచి విషయాలు విన్నట్లు ట్రంప్ తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందు తమ ప్రాణాలను కాపాడిందని తనకు చాలామంది చెప్పారని కూడా ట్రంప్‌ వెల్లడించారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కొందరికి కరోనా వైరస్‌ సోకిందన్న విషయం తెలియగానే తాను హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వాడటం మొదలుపెట్టానని మే నెలలో ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌  వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొందరు రోగుల్లో మరణాలు పెరిగాయని, గుండె సంబంధమైన సమస్యలకు ఈ డ్రగ్‌ కారణమైందని 'ది లాన్‌సెట్' ఒక పరిశోధనా పత్రం వెల్లడించడంతో దీనిపై జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిచిపోయాయి.ఈ ఫలితాల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు సంస్థలు ట్రయల్స్‌ ను నిలిపేశాయి. అయితే తన పరిశోధనలో లోపాలున్నాయంటూ 'ది లాన్‌సెట్‌' తన స్టడీ పేపర్‌ను వెనక్కి తీసుకోవడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ట్రయల్స్‌ ను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...