పాపం 16 బాలికకు మద్యం తాగించి లైంగికదాడి....

ఒకవైపు కరోనతో దేశం అల్లడి పోతుంటే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 16 ఏండ్ల బాలిక ఢిల్లీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్నది. శుక్రవారం సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు ఒంటరిగా చేరుకున్న ఆ బాలికను గమనించిన కొందరు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె వెళ్లాల్సిన రైలు ఎక్కిస్తామని నమ్మింఛి ఆ బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోగా మత్తులో రోడ్డు పక్కన ఉన్న బాలికను పోలీసులు గమనించారు. కోత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించి మహిళా పోలీసుల చేత ఆరాతీయించగా ఈ విషయం తెలిసింది. ఆమెకు హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స అందించిన అనంతరం చిన్నారుల సంక్షేమ సంఘానికి అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: