India and China on High Alert Over Rising Border Tensions

భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిందని భారత సైన్యం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఒక అధికారితో పాటు ఇద్దరు జవాన్లు చనిపోయారని చెప్పింది.చైనాతో ఘర్షణలో తమ సైనికులు చనిపోయారని భారత సైన్యం చెప్పటం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వశాఖను ప్రశ్నించగా భారతదేశం ఏకపక్ష చర్యలు చేపట్టరాదని, ఇబ్బందులను పెంచరాదని చైనా స్పందించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.చైనా సైన్యం వైపు ఎంతమంది సైనికులు చనిపోయారని కానీ గాయపడ్డారని కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. భారత సైన్యం సరిహద్దు దాటి వచ్చిందని చైనా సైనికుల మీద దాడి చేసిందని చైనా ఆరోపించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది.భారత సైన్యం ప్రధాన కార్యాలయం జారీచేసిన ప్రకటన ప్రకారం.. ఇరు దేశాల సైన్యాలకు చెందిన సీనియర్ అధికారులు ఘర్షణ జరిగిన ప్రాంతంలో సమావేశమై సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నారు.లదాఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో సరిహద్దులో ఉద్రిక్తతలను చల్లార్చటానికి భారత్, చైనా సైన్యాల మేజర్ జనరళ్లు చర్చలు జరుపుతున్నారని సైనిక వర్గాలు తెలిపాయి.తాజా పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం మధ్యాహ్నం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లతో సమావేశమై చర్చించారు.
Comments
Post Your Comment
Public Comments: