All SSC Students Promoted in Telangana - No more exams

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్, అసైన్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులను ప్రమోట్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు .
Comments
Post Your Comment
Public Comments: