ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు....

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందించారు.
• తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరఫున 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఛైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ ఆర్. లింబాద్రి, వైస్ ఛైర్మన్ శ్రీ వి. వెంకటరమణ, సెక్రటరి శ్రీ ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ శ్రీ ఒ.ఎన్. రెడ్డి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో 2 లక్షల 50 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు.
• గ్రీన్ కో గ్రూప్ 5 కోట్ల రూపాయల విలువైన లక్ష పిపిఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి శ్రీ అనిల్ చలమలశెట్టి సీఎంకు అందించారు.
• మైత్రా ఎనర్జీ గ్రూప్ 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన పిపిఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను ఎం.డి. శ్రీ విక్రమ్ కైలాస్, డైరెక్టర్ శ్రీ వివేక్ కైలాస్ సీఎంకు అందించారు.
• తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2 కోట్ల రూపాయల విలువై వైద్య పరికరాలను అందించడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.
• శ్రీ రామచంద్ర మిషన్ 1 కోటి 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయిన్ట్ సెక్రటరి శ్రీ వంశీ చలగుల్ల, డా. శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు.
• ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి. శ్రీ వెంకటేశ్వర రెడ్డి సీఎంకు అందించారు.
Comments
Post Your Comment
Public Comments: