కరోనాని ప్రరద్రోలటానికి వైనతేయ హోమం...

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయీ.
భారత్‌లోనూ కరోనా వైరస్ ప్రతాపం చూపుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా
లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.. ఇంతవరకు సరైన వ్యాక్సిన్ లేని వైరస్ నివారణకు
సామాజిక దూరం ఒక్కటే మార్గంగా భావించిన ప్రభుత్వాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా ఆలయాలు అన్ని కూడా మూతపడ్డాయి
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో గల
అనివెట్టి మండపం నందు 'వైనతేయ' హోమాన్ని విశ్వశాంతి మరియు సర్వ జన
సంక్షేమం కోసం నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలంతా
ఆరోగ్యంగా ఉండాలని అరసవల్లి సూర్య క్షేత్రంలో ప్రత్యేక హోమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ
ప్రధాన అర్చకులు వెల్లడించారు. సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం మరియు ఆరోగ్య ప్రదాత .
ఈ మహమ్మారిని ప్రబలకుండా చేయాలని సూర్యనారాయణ స్వామి ప్రార్థించినట్లు పేర్కొన్నారు.లాక్‌డౌన్
నిబంధనల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ భక్తులు ఎవరినీ
ఈ హోమ పూజలకు అనుమతించకుండా చేస్తున్నామని సహాయ కమిషనర్ , కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: