అక్షయ తృతీయ : ఇవి దానం చేస్తే సకల శుభాలు...

లాక్‌డౌన్ కారణంగా బంగారం కొనే పరిస్థితి లేదు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని మహిళల నమ్మికం. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనే దాని కంటే దానాలు, జపాలు, పూజలు చేస్తే ఎన్నో రెట్ల ఫలితాన్నిస్తాయని పురోహితులు చెబుతున్నారు . శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ రోజు పండ్లు, అన్నం, చెప్పులు, నువ్వులు, మంచం, దుస్తులు, కొబ్బరికాయలు,మజ్జిక, గొడుగు, భూమి,బంగారం, రజితం దానం చేస్తే పుణ్యం తో పాటు చక్కటి ఫలితాల్ని లభిస్తాయట.
*****అవేంటో ఒక్కసారి చూద్దాం*****
* సిరి సంపదలు దక్కాలంటే జలదానం చేయాలి
* ఆరోగ్యంగా వుండాలంటే కొబ్బరికాయలు దానం చేయాలి
* ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే చందనం దానం చేయాలి
* కష్టాల బారిన పడకుండా ఉండేందుకు చెప్పులు, పాదుకలు, గొడుగు దానం చేయాలి
* వస్త్రాలు, పండ్లు దానం చేస్తే విద్యా బుద్ధులు లభిస్తాయి
* కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే మంచం, పరుపులు, దుప్పట్లు దానం చేయాలి
Comments
Post Your Comment
Public Comments: