ట్రంప్ కు చైనా ప్రతినిధి జవాబు.. ఫ్లూట్ ఊదిన డ్రాగన్..సింహం పంజా ఎలావుంటదో..

కరోనా వైరస్ చైనా ప్రయోగశాల నుంచి వచ్చింది కావున ప్రపంచంలో జరుగుతున్న ఈ తీవ్ర పరిణామాల కు చైనానే బాధ్యత తీసుకోవాలని ట్రంప్ చైనాపై విమర్షల వర్షం గుప్పిస్తున్నారు.చైనా విదేశాంగ శాఖకు చెందిన ప్రతినిధి జంగ్ షువాంగ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం అమెరికా మానుకోవాలని చైనా తెలియజేసింది.చైనా అమెరికాపై విమర్శలు చేసింది. కరోనా వైరస్ దాడిలో చైనా కూడా బాధిత దేశమే అని ఇతర దేశాలను పీడించి నట్లే మమ్మల్ని కూడా పీడించిందని వైరస్ కట్టడి కోసం చైనా పని చేస్తోందని మహమ్మారిని అదుపు చేసేందుకు తాము ఎన్నో త్యాగాలు చేశామన్నారు. ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు అన్నీ కలసి పని చేయాలి కానీ ఒకరిపై ఒకరు నిందలు వేయడం సరి కాదన్నారు వైరస్ వల్ల కలిగిన నష్టానికి చైనానే నష్టపరిహారం చెల్లించాలన్న అమెరికా వాదనను డ్రాగన్ దేశం కొట్టిపారేస్తూ ట్రంపు చేసిన హెచ్చరికల తీరును తప్పు పట్టిన చైనా. 2019లో హెచ్1ఎన్ 1 ఫ్లూ అమెరికాలో ప్రబలిందని అదేవిధంగా 1980 దశకంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అమెరికా నుంచి వ్యాపించింది మరియు 2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటి సంఘటనలకు మరియు వాటికి సంబంధించిన దుష్పరిణామాలకు అమెరికా బాధ్యత వహించిందా అని చైనా ప్రశ్నించింది.గతంలో అమెరికా నుండి ప్రబలిన ఎన్నో వ్యాధుల కారణంగా కలిగిన సంక్షోభంకు సంబంధించిన బాధ్యతలను అమెరికా తీసుకుందా అని చైనా ప్రశ్నించింది.
Comments
Post Your Comment
Public Comments: