లేడీ ఎస్పీ 7 నెలల గర్భిణి..లాక్ డౌన్ డ్యూటీ..

7 నెలల గర్భిణి, తేడా వస్తే మొదటికే మోసం, అయిన అమృత సోరి ధైర్యంగా విధులకు హాజరు. చిన్న తేడా వచ్చినా తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కరోనా వ్యాధి సోకే అవకాశం ఉందని తెలిసినా ధైర్యంగా హాజరుకావడంతో సాటి సిబ్బంది ఆమెకు సెల్యూట్ చేశారు.7 నెలల గర్భిణి అయిన లేడీ ఎస్పీ సెలవులో ఉండకుండా రోడ్డు మీదకు వచ్చి కరోనా లాక్ డౌన్ డ్యూటీ చేస్తూ సాటి పోలీసుల్లో ధైర్యం నింపుతూ కరోనా వైరస్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా తన కంటే తక్కువ స్థాయి ఉద్యోగులు అని ఏ మాత్రం చిన్నచూపు చూడకుండా అందరితో కలిసి ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్పీని అందరూ కరోనా వారియర్ అంటూ అభినందిస్తున్నారు.2007 బ్యాచ్ స్టేట్ సర్వీస్ ఆఫీసర్ అయిన అమృత సోరి చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో సిన్సియర్ పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకొన్న అమృత సోరిగారు ప్రస్తుతం రాయపూర్ అడిషనల్ పోలీసు ఎస్పీగా ఉద్యోగం చేస్తున్నారు.
"సాటి పోలీసులు మేము డ్యూటీలు చేస్తున్నాం, మీరు ఇంటికి వెళ్లి క్షేమంగా ఉండండి, అంతా మేము చూసుకుంటాం అంటూ సాటి పోలీసులు అమృత సోరికి నచ్చ చెప్పినా అమృత సోరి గారు వినకుండా మీతో పాటు నేను ఇక్కడే విధుల్లో ఉంటానని, తనకు ఏమీ కాదని ఆమె కంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు చెప్పటం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
Comments
Post Your Comment
Public Comments: