తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

అనుమానిత లక్షణాలునా కొందరు ఆస్పత్రికి వస్తే పెద్ద తలనొప్పి అనుకొని ఇంటి వద్దే పరీక్షలకు వచ్చేందుకు సంకోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రి దాకా వచ్చే అవసరం లేకుండా రోగుల నమూనాలను ఇళ్ల వద్దే సేకరించాలని పరీక్షలు కూడా ఇళ్ల వద్దే నిర్వహించేందుకు వీలుగా ఒక ప్రత్యేకమైన వాహనాన్ని వైద్య ఆరోగ్య శాఖ తయారు చేయిస్తోంది.ఈ నిర్ణయం ప్రభుత్వానికి పెద్ద భారమే.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా హైదరాబాద్ లో తొలుత ఈ సేవలను ప్రారంభించనున్నారు.ఇంటివద్దకే వచ్చి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే దాకా వారిని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంఛి ఒక వేళ పాజిటివ్ వస్తే అప్పుడు ఆస్పత్రికి తరలిస్తారు.క్వారంటైన్‌లో ఉన్న అనుమానితులందరినీ ఒకేచోట ఉంచితే పాజిటివ్ వచ్చిన వారి నుంచి మిగిలిన వాళ్లకూ సోకుతుంది కాబట్టి కంటైన్‌మెంట్ జోన్లలో పెద్ద సంఖ్యలో నమూనాలను సేకరించాల్సి వచ్చినా ఇంటి వద్దే నమూనాలను సేకరించే పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.ఈ చేయటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ శాంపిళ్లను సేకరించడంతో పాటు, ప్రభుత్వానికి భారం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Post Your Comment
Public Comments: