అగ్రరాజ్యంలో విలయతాండవం..24 గంట్లలో 4,591 మంది మరణం..

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఎటుచూసినా కరోనా మహ్మమారి బారినపడి మృత్యువు విలయతాండవం చేస్తోంది. కరోనా మహ్మమారి కారణంగా నిమిషానికి ముగ్గురి చొప్పున ప్రాణాలను కోల్పోతున్నారు. గత 24 గంట్లలో 4,591 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల మధ్య సగటున గంటకు 107 మంది చనిపోగా, ఇప్పుడా సంఖ్య 191 చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 35 వేలు దాటిపోయింది. న్యూయార్క్లో పరిస్థితి మరింత దారుణం ఇప్పటి వరకు 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 7 లక్షల కేసులు నమోదయ్యాయి.
Comments
Post Your Comment
Public Comments: