హైదరాబాద్‌లో అంతకంతుకు పెరుగుతున్న కరోనా..

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ పెరుగుతోంది. రాష్ట్రం మొత్తంలో అధికంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేసులునమోదు అవ్తున్నాయీ . ఆదివారం రోజు మరో 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు . ఈ పాజిటివ్ కేసులకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహింఛి వారందరినీ కూడా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సైతం కరోనా పాజిటివ్ రావడం చాలా నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Post Your Comment
Public Comments: