లాక్ డౌన్ మే 7 పొడిగింపు KCR కీలక నిర్ణయం....

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు మే 3 వరకు యధావిధిగా కొనసాగుతుందని కానీ తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ కాలాన్ని మే 7 వరకు పొడిగిస్తున్నట్టు కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ కేబినెట్ మరోసారి సమావేశం మే 5వ తేదీన జరుగుతుందని అప్పటి పరిస్థితులను బట్టి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ ప్రకటించారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ ఆదేశాలు యధాతథంగా అమల్లో ఉంటాయని తెలంగాణలో రేపటి నుంచి ఎలాంటి లాక్ డౌన్ సడలింపులు లేవని సీఎం కేసీఆర్ అధికారికంగా స్పష్టం చేశారు. నిత్యావసరాలు, పాలు, ఇతరత్రా ప్రజలకు అవసరమైనవి మాత్రం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అంచనా వేస్తే మే 1 తర్వాత కొంచెం తగ్గుముఖం పడుతుందని ప్రస్తుతం కరోనా క్వారంటైన్లలో ఉన్నవారు, ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్న వారిలో చాలా వరకు మే 1 నాటికి వెళ్లిపోతారని కేసీఆర్ చెప్పారు.
Comments
Post Your Comment
Public Comments: