మహా నగరంలో కలకలం.....ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా...

హైదరాబాద్ మహా నగరంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దానింకి కారణం స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా సోకినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అతడికి వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీంతో వైద్యాధికారులు వెంటనే ఈ విషయాన్ని పోలీసుకొని నాంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువకుడిగా గుర్తించారు. ఏడాది నుంచి అతడు స్విగ్గీలో పనిచేస్తున్నాడని అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అయితే, అతడు ఈ మధ్యకాలంలో ఎవరెవరికి ఫుడ్ డెలివరీ చేశాడో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. నాంపల్లిలోని అతడి ఇంటి పరిసర ప్రాంతాల్లో రెండు వారాల పాటు కంటైన్మెంట్ విధింఛి అతడి కుటుంబసభ్యులతో పాటు మరో ముగ్గురిని క్వారంటైన్‌కు పంపారు. అతడు ఏయే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ సేకరించాడు?, ఏయే ప్రాంతాల్లో వారికి డెలివరీ చేశాడు?, అతడితో పాటు కలసి పనిచేసిన తోటి స్విగ్గీ ఉద్యోగుల వివరాలు ఆరా తీసేపనిలో పోలీసులు, అధికారులు నిమగ్నం అయ్యారు.
Comments
Post Your Comment
Public Comments: