లాక్ డౌన్ సమయ తన సమీప బంధువు అనారోగ్యంతో చనిపోవడంతో హీరో సల్మాన్ ఖాన్ ఆ బాధను అనుభవిస్తున్నాడు. గోవా బ్యూటీ ఇలియానా కి కూడా ఇలాంటి మనోవేదనకు గురైంది. తన సమీప బంధువు ఒకరు చనిపోవడాన్ని ఇలియానా అస్సలు తట్టుకోలేకపోతోందటా. టిరు అంకుల్ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సోషల్ మీడియాలో తన బాధను వెళ్లగక్కింది. తనకు తన అంకుల్ కేవలం అంకుల్ మాత్రమే కాదు... రెండో తండ్రి అంటూ ఆయనతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.జంతు ప్రేమికుడిగా తమ అందరి మనసులను గెలుచుకున్న టిరు అంకుల్ లేడనే విషయాన్ని ఆమె ఏ మాత్రం తట్టుకోలేకపోతోంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయన ఒక జెంటిల్ మేన్ అంటూ కీర్తించింది.
Comments
Post Your Comment
Public Comments: