Jyotiraditya Scindia Comments on Congress Party | కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎదుర్కొనే సత్తా లేదు

మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బుధవారం ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కమళం గూటికి చేరారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే తన అంతమ లక్ష్యమని, దాని కోసమే బీజేపీలో చేరుతున్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు తనను ఎంతో ఆకర్షించాయని చెప్పారు. నాయకత్వలేమితో, వరకు ఓటములతో, పార్టీలో కుమ్ములాటతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పార్టీని ముందుండి నడిపిస్తూ, ప్రచారాన్ని భుజానకెత్తుకుని మోస్తున్న యువతకు అధిష్టానం మొండిచేయి చూపుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కమల్‌నాథ్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి చేసేందుకు బీజేపీకి తనకు అవకాశం కల్పించిందని, ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశాభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వారి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: