ప్రేక్షకులకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఆఫర్లు... రానున్నాయ స్ట్రీమింగ్ యాప్స్ రోజులు...

లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని జనాలు వెదికి వెదికి మరీ సినిమాలు చూసేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ను మరింత దగ్గర చేసింది. పల్లె పల్లెకు కూడా తెలిసిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ అంటే అమెజాన్ ప్రయిమ్ ,నెట్ ప్లిక్స్, హాట్ స్టార్ మరియు ఈ మధ్యనే ఆహా వచ్చి చేరింది.ఐతే రెడీ అయిపోయి విడుదల ఆగిపోయిన సినిమాలలో ఉప్పెన, వి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఒరేయ్ బుజ్జిగా లాంటి చిన్న సినిమాలు వున్నాయి. అమెజాన్ ప్రయిమ్ సంస్థ ఉప్పెన, వి సినిమాలకు ఓపెన్ ఆఫర్లు ప్రకటించినట్లు , ఆన్ లైన్ లో విడుదల చేసేద్దామని, రేట్ కోట్ చేయమని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది.ఉప్పెన సినిమాకు 30 కోట్లకు పైగా, వి సినిమాకు 35 కోట్లకు పైగా ఖర్చయింది. ఐతే అమెజాన్ ప్రయిమ్ ఇంత మొత్తం చెల్లిస్తుందా? అన్నది అనుమానం. అయితే అమెజాన్ ప్రతినిధుల రేట్ కోట్ చేయడం లేదు. రివర్స్ లో ఎంతకు ఇస్తారు చెప్పండి అని అడుగుతున్నారట. ఇందులో నిజం ఎంతో ఆభద్ధం ఎంతో తెలియాలంటే వేచి చూడాలి.
Comments
Post Your Comment
Public Comments: