ఈఎంఐ...లోన్లు...విత్‌డ్రా ఛార్జీలు..మినిమమ్ బ్యాలెన్స్ ... చర్చలు నో ప్రాబ్లమ్..?

కరోనా దెబ్బకు ఇండియా లాక్‌డౌన్ అయ్యింది. మరో 21 రోజుల పాటు ఈ పరిస్థితి తప్పదు.ఈ తరుణంలో ఈఎంఐ, లోన్ల నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు రిలాక్సేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనున్నట్లు సమాచారం.చిరు వ్యాపారులు, డైలీ వర్కర్ల ఈ ప్రభావం పూర్తిగా ఉంది. ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని ఎన్‌బీఎఫ్‌సీ అసోసియేషన్ రిజర్వు బ్యాంకును కోరిందని సమాచారం. లోన్ల విషయంలో సడలింపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం త్వరలో ఉంది. అంతేకాకుండా ఏటీఎంలలో మనీ విత్‌డ్రా ఛార్జీలు బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సర పన్ను చెల్లింపుల్లో ఇన్‌కం టాక్స్ రిటర్నుల గడువు తేదీని పెంచుతున్నామన్నారు నిర్మలా సీతారామన్. 30 జూన్ 2020 కల్లా వాటిని ఫైల్ చెయ్యాలని టీడీఎస్‌ల డిపాజిట్ల విషయంలో మాత్రం గడువు తేదీని పెంచే అవకాశంలేదన్నారు. టీడీఎస్‌లపై ఆలస్యమయ్యే ఫైన్ వడ్డీ రేటు ప్రస్తుతం 18గా ఉండగా దాన్ని 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: