leander paes & kim sharma Spark Romance Rumors

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో బాలీవుడ్ భామ కిమ్‌శర్మ చెట్టాపట్టాలేసుకుని గోవా బీచ్‌లో తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ పలుమార్లు జంటగా గతంలోనూ కెమెరాకు చిక్కారు. తాజాగా, మరోసారి వీరు గోవాలోని ఓ హోటల్‌లో కంటబడడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఫొటోలను పోస్టు చేసిన కిమ్‌శర్మ ‘మిస్టర్.పి’ అంటూ పేస్ పేరును వెల్లడించింది. కిమ్‌శర్మ గతంలో తెలుగులో మగధీర, ఖడ్గం సినిమాల్లో నటించింది. 48 ఏళ్ల మోడల్ రియాతో సహజీవనం చేస్తున్న లియాండర్‌కు ఓ కుమార్తె కూడా ఉంది.
Comments
Post Your Comment
Public Comments: